Share News

Palla Srinivasa Rao: ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు

ABN , Publish Date - Jun 08 , 2025 | 05:41 AM

తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Palla Srinivasa Rao: ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు

  • ముందు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారమివ్వండి

  • టీడీపీ నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశానుసారం పార్టీ నేతలకు ఆయన శనివారం ఓ లేఖ రాశారు. ‘ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని టీడీపీలో చేర్చుకునే విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దు. ఎవరైనా పార్టీలో చేరాలని అనుకుంటే తప్పనిసరిగా వారి గురించి టీడీపీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. కేంద్ర కార్యాలయం వారి గురించి విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ గమనించాలి’ అని పల్లా స్పష్టం చేశారు.

Updated Date - Jun 08 , 2025 | 05:43 AM