ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rammohan Naidu: వారికి ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

ABN, Publish Date - Jun 27 , 2025 | 08:51 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు జగన్‌కి అధికారం ఇస్తే ఏం చేశారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

Union Minister Rammohan Naidu

శ్రీకాకుళం: సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని.. తాము గర్వంగా చెబుతున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ఉద్ఘాటించారు. తల్లికి వందనం నుంచి బ్రహ్మాండమైన స్పందన తమ ప్రభుత్వానికి వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులకు, అలానే ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సర్వీసు కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ప్రజలు అన్నివిధాలుగా కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్నారని.. అదే తమకు శ్రీరామరక్ష అని అభివర్ణించారు. ఇవాళ(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు జగన్‌కి అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. విధ్వంసకర పరిపాలనతో ఏపీని చాలా నష్టపరిచారని మండిపడ్డారు. ఏపీని ఆర్థిక వలయంలోకి నెట్టేశారని విమర్శించారు. అసభ్యకరమైన పదాలతో అసెంబ్లీని భ్రష్టు పట్టించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైర్ అయ్యారు రామ్మోహన్ నాయుడు.

గత ఐదేళ్లు వైసీపీ నేతలు ఎన్నో అరాచకాలు సృష్టించారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే ప్రజావేదికను కూల్చేసి పరిపాలన మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి ఇంకా బుద్ది రాలేదని నిప్పులు చెరిగారు. ఇంకా నరికేస్తాం, పొడిచేస్తాం, చంపేస్తాం అని చెప్పి లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు ప్రతి దానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు రామ్మోహన్ నాయుడు.

వైసీపీ నేతల మాయమాటలు నమ్మరు..

‘పోలీసుల కార్ల మీద ఎక్కి డాన్స్‌లు చేయడం, వారిపైన రాళ్లు విసరడం, పోలీసులను రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేశారు. అన్ని వాళ్లే చేసి తిరిగి మళ్లీ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు వెళ్లడం ఎంత విడ్డూరం. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. వారు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. వైసీపీ నేతలు ఎన్ని విధాలుగా కుట్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. సింగయ్య మృతికి జగనే కారణం. సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కనీసం మృతిచెందిన కార్యకర్త కుటుంబాన్ని మానవత్వంతోనైనా పరామర్శించే ఉద్దేశం జగన్‌కి ఉండదా. మృతదేహాలతో రాజకీయం చేయడమనేది వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. శవాలపైన చేసే నీచ రాజకీయాలు దయచేసి మానుకోవాలి’ అని రామ్మోహన్ నాయుడు హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్

సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 09:02 PM