ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్

ABN, Publish Date - May 05 , 2025 | 08:47 AM

Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Kavali Pylon Toppling Case

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కావలిలో అమృత్ పథకం కింద రూ. 88 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గుర్తింపుగా నిర్మించిన పైలాన్‌ను కొంతమంది దుండగులు కూల్చివేశారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో అమృత్ పథకం పైలాన్‌ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టింది. ఈ పైలాన్‌ను ఎవరూ కూల్చారనే దానిపై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. పైలాన్‌ను కూలదోసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు.


జగన్ ప్రభుత్వ హయాంలో వీరంతా జర్నలిస్టుల ముసుగులో అరాచకాలు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అండతో వైసీపీ మూకలు రెచ్చిపోయారనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో వైసీపీ కీలక నేతల పేర్లని నిందితులు బయటపెట్టారు. అజ్ఞాతంలోకి కొందరు వైసీపీ నేతలు వెళ్లిపోయారు. పూర్తిస్థాయిలో పోలీసులు ఈ కేసుని‌ విచారిస్తున్నారు. నాటి వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2020లోనే పోలీసులు‌ ఈ కేసు నమోదు చేసినా ఇంతకాలం విచారణ చేపట్టలేదు.


ముఖ్యంగా ఈ ఘటన వెనుక వైసీపీకి చెందిన కీలక నేతల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పైలాన్ కూల్చివేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

Nara Lokesh: బకింగ్‌ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి

విషం చిమ్ముదాం

టెల్‌అవీవ్‌ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 09:00 AM