ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ramanaidu: పోలవరం, బనకచర్లతో రాయలసీమ అభివృద్ధి: మంత్రి నిమ్మల

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:44 PM

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రాసంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Minister Nimmala Ramanaidu

కర్నూలు జిల్లా: పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే రాయలసీమ పచ్చగా మారుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓర్వలేక వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం, బనకచర్లను ఏపీ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో నిర్మించనుందని వెల్లడించారు. రాష్ట్రాన్ని వైసీపీ ఐదేళ్లు పాలించి.. ఖాళీ చిల్లుకుండ ఇస్తే, చంద్రబాబు ఆ చిల్లు పూడ్చి నింపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ఇవాళ(బుధవారం) మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లెలో రూ.678.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. రూ.141 లక్షలతో కర్నూలు - అనుగొండ రోడ్డు నుంచి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారురోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా పాల్గొన్నారు. తడకనపల్లి గ్రామం మహిళలు దేశానికే గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రా సంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వాతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ అందించామని వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

రూ.1000లు పెన్షన్ పెంచడానికి జగన్‌కి ఐదేళ్లు పట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కర్నూలు జిల్లాలో 2294 పనుల కోసం రూ.2014 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పలు కీలక పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. 5653 హెక్టార్ల డ్రిప్‌ను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. రూ.3800 కోట్లు హంద్రీనీవా ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశామని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.

గత ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, తట్ట మట్టి కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మోటార్లను సైతం పూర్తి స్థాయిలో వాడుకోలేదని చెప్పారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే, అందులో కర్నూలు జిల్లాకే 30 శాతం పోస్టులు కేటాయించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్...

For More AP News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 02:27 PM