ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Paka Satyanarayana: కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే బీసీలకు అన్యాయం

ABN, Publish Date - May 05 , 2025 | 01:22 PM

Paka Satyanarayana: బీసీలని మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కి దక్కిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలకు ఉన్న హక్కులని సైతం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని పాకా సత్యనారాయణ ధ్వజమెత్తారు.

Paka Satyanarayana

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఇటీవలే తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కులగణన అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ (Paka Satyanarayana) తెలిపారు. ఈ గొప్ప కార్యానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నా సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బీసీ కులానికి చెందిన సంఘాలు దశాబ్దాల కాలం నుంచి వేచి చూస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం శుభతరుణమని అన్నారు. 60శాతం ఉన్న బీసీలకు ఉన్న హక్కులను పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు.


1931నుంచి ఎలాంటి గణంకాలు తీసుకోకుండా బీసీలను ఊహ జనకంగా మాత్రమే ఉంచారని పాకా సత్యనారాయణ అన్నారు. ఇవాళ(సోమవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పాకా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో బీసీలకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా ఆధారంగా గణంకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. 102వ రాజ్యాంగ సవరణ ఆధారంగా బీసీలకు ఉన్న హక్కులను ఇప్పుడు ఉన్న గణంకాలతో సరిచేయడం సాధ్యమవుతుందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలకు ఉన్న హక్కులను సైతం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని పాకా సత్యనారాయణ విమర్శించారు.


బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కి దక్కిందని పాకా సత్యనారాయణ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు బీసీలకు సంబంధించి కమిషన్ వేయలేదని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలని వెలుగులోకి తీసుకువచ్చేలా రోహిణి కమిషన్‌ని నియమించారని తెలిపారు. ఈ కమిషన్ ద్వారా అట్టడుగున ఉన్న వర్గాల వారిని సైతం కేటగిరీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. బీసీల్లో విద్యా, ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయటానికి ఈ గణంకాలు ఎంతగానో ఉపయోగపడుతాయని పాకా సత్యనారాయణ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్

Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

Nara Lokesh: బకింగ్‌ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి

విషం చిమ్ముదాం

టెల్‌అవీవ్‌ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 02:28 PM