Huge Fraud: వైసీపీ హయాంలో మరో భారీ కుంభకోణం.. బయటపడ్డ సంచలన విషయాలు
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:12 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు వరుసగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై వరుసగా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
తిరుపతి: గత వైసీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు వరుసగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) పరిధిలో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోటి రూపాయలపైనే ముఠా దండుకుంది. కడప జిల్లాకి చెందిన ముఠాపై పోలీసులకు అదానీ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అదానీ సంస్థలో పది సంవత్సరాల ఉద్యోగం గ్యారంటీ పేరుతో ఒక్కో నిరుద్యోగి నుంచి కడప జిల్లా ముఠా రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూల్ చేసింది. 100 మందితో నగదు వసూళ్లకు పాల్పడ్డారు. నిరుద్యోగుల నుంచి నగదు వసూళ్లలో అదానీ సంస్థ ఉద్యోగితో పాటు ఆయన సోదరుడు, మరొకరిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు..
For More AP News and Telugu News
Updated Date - Jun 10 , 2025 | 12:43 PM