Dhulipalla Narendra: పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.. ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:16 AM
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
గుంటూరు జిల్లా: పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు (YSRCP Leaders) కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంపైన బురద జల్లేందుకు, తమను అప్రదిష్ట పాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
టీడీపీ నేత బండ్లమూడి బాబురావు, అశోక్‌పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్రపన్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. టీ స్టాల్ వద్దకు ఐదుగురు వైసీపీ నాయకులు టీడీపీ వారి మీద దాడికి వచ్చినట్లుగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు నాగమల్లేశ్వరరావుపై దాడి చేశారని గుర్తుచేశారు. నాగమల్లేశ్వరరావుపై దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే వైసీపీ నేతలు ప్రైవేట్ ఆస్పత్రికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్.
వైసీపీ వ్యక్తికి చెందిన ఆస్పత్రికి నాగేమల్లేశ్వరావుని తరలించి, సరైన వైద్యం అందకుండా కుట్ర పన్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. సింగయ్య మృతి ఘటనలో కోటి రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. నాగేమల్లేశ్వరావుపై జరిగిన దాడిలో కూడా కుట్ర దాగుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాలనే నాగమల్లేశ్వరరావుకి సకాలంలో వైద్యం అందకుండా చేశారని దుయ్యబట్టారు. నాగమల్లేశ్వరరావుని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తమ ప్రభుత్వంపై కుట్రకు తెరలేపారని ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్
For More AP News and Telugu News
Updated Date - Jul 06 , 2025 | 11:28 AM