AP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
ABN, Publish Date - May 02 , 2025 | 09:53 AM
AP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రీడాకారుల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.
అమరావతి: మెగా డీఎస్సీలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద 421 ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాలకు దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్, ఏపీ రెసిడెన్షియల్, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. క్రీడాకారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు వెబ్‌సైట్‌ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ప్రారంభించారు. ఇవాళ (మే 2) నుంచి మే 31వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణకు ఏపీ ప్రభుత్వం గడువు విధించింది.
క్రీడాకారులకు ఈరోజు 10గంటల నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. sports.ap.gov.in / sports dsc.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సీనియర్ క్రీడా విభాగంలో మెరిట్ ఆధారంగా ప్రభుత్వం ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్ర స్థాయి ఫైనల్ కమిటీల ద్వారా తుది జాబితాకు ఆమోదం తెలపనుంది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడారు.
క్రీడాకారుల 30 ఏళ్ల కల ఈ రోజుతో సాకారమవుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఏపీలో క్రీడాకారులకు రాత పరీక్ష లేకుండా 3శాతం హారిజంటల్ రిజర్వేషన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కల్పించారని చెప్పారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడాకారుల కలను సాకారం చేసిన సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రులకు శాప్ చైర్మన్ రవినాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gopi ACB Custody: రెండు రోజు ఏసీబీ కస్టడీకి గోపి
CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం..
High Court: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 10:07 AM