Share News

CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం..

ABN , Publish Date - May 02 , 2025 | 09:08 AM

ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గన్నవరం విమానాశ్రయం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 15 సెక్టార్లుగా బందోబస్తును అధికారులు విభజించారు. ఒక్కొక్క సెక్టార్‌కు ఎస్పీ, ఏ ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు.

CM Chandrababu: ప్రధాని మోదీకి  మనఃపూర్వకంగా స్వాగతం..
CM Chandrababu Naidu tweet

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) నిర్మాణ పనుల పున:ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ట్విట్ (Tweet) చేశారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరవలేనిదని, రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్ఠించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందన్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని.. ఇందుకు సహకరిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నానని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.


క్షిపణి పరీక్షా కేంద్రం వర్చువల్‌గా ప్రారంభం..

కాగా కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, గుల్లలమోదలో నిర్మిస్తున్న క్షిపణి పరీక్షాకేంద్రానికి డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ చేరుకున్నారు. గుల్లలమోదలో రూ. 20 వేల కోట్లతో డీఆర్డీవో క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మించనుంది. ఈ పనులను అమరావతి నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వర్చువల్ ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను సమీర్ వీ కామత్ పరిశీలించారు. ఈ క్రమంలో గుల్లలమొదలో రక్షణ శాఖ భారీగా రక్షణ ఏర్పాట్లు చేపట్టింది.

పోలీసుల వలయంలో గన్నవరం విమానాశ్రయం

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గన్నవరం విమానాశ్రయం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 15 సెక్టార్లుగా బందోబస్తును అధికారులు విభజించారు. ఒక్కొక్క సెక్టార్‌కు ఎస్పీ, ఏ ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో అమరావతిలోని సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5:15 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Also Read: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట


ప్రధాని సభకు 5 లక్షల మంది..

ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాజధానికి తరలివచ్చే ప్రజల కోసం రవాణావసతి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాజధానికి వచ్చే ప్రజల కోసం 8 వేల బస్సులు ఏర్పాటు చేసింది. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సులు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1400 బస్సులు ఏర్పాటు చేసింది. గురువారం రాత్రికి సంబంధిత గ్రామాలకు బస్సులు చేరుకోనున్నాయి. ఒక్కో బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇన్ ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. సభకు జనాలను తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఇన్ ఛార్జులకు అప్పగించింది. ఏర్పాట్ల పర్యవేక్షణకు మండలానికి ఒక అధికారికి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది. బస్సులు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించింది. రాజధానికి వెళ్లే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయం కల్పించింది. వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్లు పంపిణీకి ఏర్పాట్లు చేసింది. జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులకు ఆహారం సరఫరా బాధ్యత ప్రభుత్వం అప్పగించింది. సభకు వచ్చే మార్గాల్లో ఆరోగ్య కేంద్రాలు, సభా గ్యాలరీల్లోనూ ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత

సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Updated Date - May 02 , 2025 | 09:25 AM