ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత
ABN, Publish Date - May 02 , 2025 | 07:40 AM
కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గత నెలలో హఫీజ్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాక్ హఫీజ్ సయీద్‌కు భద్రతను కట్టుదిట్టం చేసింది. పహెల్గాం దాడి నేపథ్యంలో భద్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది (Terrorist), లష్కరేతోయిబా చీఫ్ (Lashkar-e-Taiba chief), ముంబై దాడుల (Mumbai Attacks) సూత్రధారి హఫీజ్ సయీద్ (Hafiz Saeed)కు పాకిస్తాన్ (Pakistan) భారీ భద్రత (Heavy Security) కల్పిస్తోంది. పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడింది లష్కరేకు చెందిన ఉగ్రవాదులే. పహెల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీజ్ సయీద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ భద్రతను నాలుగు రెట్లు పెంచిన పాక్ ప్రభుత్వం.. హఫీజ్ నివాసానికి 4 కి.మీ. మేర హై రిజెల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.
Also Read: సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి
కాగా ఇన్నాళ్లూ హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నాడని పాక్ బుకాయిస్తూ వస్తోంది. కానీ హఫీజ్ మాత్రం దర్జాగా తన నివాసం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గత నెలలో హఫీజ్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాక్ హఫీజ్ సయీద్‌కు భద్రతను కట్టుదిట్టం చేసింది. పహెల్గాం దాడి నేపథ్యంలో భద్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ కగార్‌ను కొనసాగించాలి
For More AP News and Telugu News
Updated at - May 02 , 2025 | 07:40 AM