Employees to Attend Modi Event: ప్రధాని సభకు హాజరుకండి
ABN , Publish Date - May 02 , 2025 | 06:07 AM
ప్రధాని మోదీ అమరావతికి రాబోతున్న సందర్భంగా, సచివాలయ ఉద్యోగులు, అధికారులు సభకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సభకు హాజరుకావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగులు, అధికారులకు సర్క్యులర్
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): అమరావతి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, అధికారులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సర్క్యులర్ జారీ చేశారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్న సభకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.