Chhattisgarh: ఆపరేషన్ కగార్‌ను కొనసాగించాలి
ABN , Publish Date - May 02 , 2025 | 06:07 AM
బస్తర్‌ను మావోయిస్టు రహితంగా మారుస్తూ ఆపరేషన్ కగార్‌ను కొనసాగించాలని బాధిత కుటుంబాలు ఛత్తీస్‌గఢ్ సీఎంను కోరాయి. మరోవైపు జార్ఖండ్‌లో మావోయిస్టులు ఎక్స్‌కవేటర్‌ను తగలబెట్టారు, కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోంది.
ఛత్తీస్‌గఢ్ సీఎంకు మావోయిస్టు బాధితుల వినతిపత్రం
చర్ల, మే 1 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌ను కొనసాగించాలని మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఛత్తీ్‌సగఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయశర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. బస్తర్‌ను మావోయిస్టు రహిత ప్రాంతంగా మార్చాలని కోరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారని, కొంత మంది కుటుంబాలను కోల్పోయారని పేర్కొన్నారు. ఒకవైపు ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతుండగా మరో వైపు జార్ఖండ్‌లోని మహుదాండ అడవుల్లోని ఓ ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఎక్స్‌కవేటర్‌ను మావోయిస్టులు తగల బెట్టారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడే ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దీనికి నిరసనగానే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని కర్రె గుట్టల్లో పదో రోజు కూంబింగ్ కొనసాగింది. మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు గుట్టలలో అణువణువూ గాలిస్తున్నాయి. గురువారం కూడా కర్రెగుట్టల్లో డ్రోన్‌లు, హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టాయి. మావోయిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో బలగాలు బాంబులు వేశాయి.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News