Share News

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి

ABN , Publish Date - May 02 , 2025 | 09:49 AM

Gopi ACB Custody: మాజీ మంత్రి విడుదల రజిని మరిది విడుదల గోపిని రెండో రోజు ఏసీబీ అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. ఈరోజు విచారణలో మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి
Gopi ACB Custody

విజయవాడ, మే 2: స్టోన్ క్రషర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల వేణుగోపీనాథ్ (గోపి)ని (Vidudala Gopi) రెండోరోజు ఏసీబీ అధికారులు (ACB) కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం జిల్లా జైలుకు వచ్చిన అధికారులు.. గోపీని కస్టడీలోకి తీసుకుని ముందుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. తొలిరోజు విచారణలో భాగంగా ఏసీబీ ముందు గోపి కీలక అంశాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ‌ వదిన విడుదల రజని చెబితేనే తాను ఫోన్ చేసినట్లు ఏసీబీ అధికారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.


స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి జాషువది కీలక పాత్ర అని గోపి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండో రోజు విచారణలో కూడా విడుదల గోపి నుంచి మరింత సమాచారం రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గోపిని రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తొలిరోజు విచారణలో భాగంగా పలు కీలక విషయాలు గోపి బయటపెట్టినట్లు తెలుస్తోంది. తన వదిన విడుదల రజని చెబితేనే స్టోన్ క్రషర్ యజమానితో మాట్లాడానే తప్ప ఎవరినీ బెదిరించలేదని చెప్పుకొచ్చారు. తనను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారంటూ విడుదల రజని, గోపి, పీఏ రామకృష్ణ, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాపై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమాని నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషర్ సజావుగా సాగేందుకు నగదు చెల్లించాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా కూడా అప్పటి మంది విడుదల రజని ఆధ్వర్యంలోనే నడించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం చేయాలని కోరగా.. దీనిపై ఏసీబీ విచారణకు సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో బెదిరింపులు నిజమే అని ఏసీబీ తేల్చడంతో పాటు ఈ కేసులో విడుదల రజని సహా నలుగురిని నిందితులుగా చేర్చింది.


ఈ కేసులో విడుదల గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయాధికారి. ఏసీబీ కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయడంతో గోపిని రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. తొలిరోజు విచారణ ముగియగా.. రెండో రోజు గోపినీ ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. మరి ఈరోజు విచారణలో గోపి ఏయే విషయాలు బయటపెట్టనున్నాడో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

Amaravati Restart : అమరావతికి జయం

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు


Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 10:24 AM