Share News

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం..

ABN , Publish Date - May 02 , 2025 | 09:00 AM

Kedarnath Temple: ఉత్తరాఖండ్ జిల్లాలోని రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయం తలుపు తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం పుష్కర్ సింగ్ దామి హాజరయ్యారు.

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం..
The Kedarnath Temple in Uttarakhand's Rudraprayag district

రుద్రప్రయాగ్, మే 02: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయం ద్వారాలు శుక్రవారం తెరుచుకున్నాయి. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య ఈ అలయం ద్వారాలను తెరిచారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ హాజరయ్యారు. ఇక ఆలయాన్ని రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాల అధికారులు, కమిటీ సభ్యులు, పూజారులతోపాటు వేద పండితులు పాల్గొన్నారు.


చార్ ధామ్ యాత్రలో భాగంగా అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రిలను ఏప్రిల్ 30వ తేదీన తెరిచిన సంగతి తెలిసిందే. బద్రీనాథ్ దేవాలయం మాత్రం మే 4వ తేదీన తెరవనున్న సంగతి తెలిసిందే. అయితే కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ నుంచి హెలికాఫ్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇక కేదార్‌నాథ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. దేవాలయ అధికారులతోపాటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేవాలయ పరిసర ప్రాంతాలలోనే కాకుండా.. పలు చోట్ల భద్రతను పెంచారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకొకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేదార్‌నాథ్ దేవాలయం తలుపులు తెరుచుకోవడంతో.. చార్‌దామ్ యాత్రా దాదాపుగా ప్రారంభమైనట్లు అయింది. బద్రీనాథ్ దేవాలయం తలుపులు మరికొద్ది రోజుల్లో తెరుచుకోనుంది. దీంతో మరి కొద్ది రోజుల్లో ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు పోటెత్తనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pakistan Vs India: పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్

Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..

Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్

For National News And Telugu News

Updated Date - May 02 , 2025 | 10:32 AM