Share News

Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..

ABN , Publish Date - May 02 , 2025 | 07:47 AM

Ambulance: పోలీసులు తనిఖీలు నిర్వహిస్తే.. అంబులెన్స్‌లో రోగి లేరు. అంబులెన్స్ డ్రైవర్ తీరు కాస్తా అనుమానాస్పదంగా ఉంది. దీంతో అంబులెన్స్‌లో అణువణువు పోలీసులు తనిఖీ చేశారు.

Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..

ముజఫర్‌పూర్, మే 02: ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తేనో.. లేకుంటే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను వినియోగిస్తారు. అందుకోసం వినియోగించాల్సిన అంబులెన్స్‌లను మద్యం రవాణాకి వినియోగించి అడ్డంగా దొరికిపోయారు. దీంతో లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి..కేసు నమోదు చేశారు. ఈ ఘటన బిహార్‌ ముజఫర్‌పూర్‌ జిల్లాలోని కాంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సదాత్‌పూర్‌ చోటు చేసుకుంది.

అంబులెన్స్‌లో 40 బాటిళ్లును స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ తెలిపారు. ఇవన్ని విదేశీ మద్యమని ఆయన చెప్పారు. వీటి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ మద్యం బాటిళ్లను పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి తీసుకువచ్చినట్లు తమ విచారణలో అంబులెన్స్ డ్రైవర్ వెల్లడించారన్నారు.


మద్యం బాటిల్లు అక్రమ రవాణా జరుగుతోన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఆ క్రమంలో వాహనాల తనిఖీలు నిర్వహించామని తెలిపారు.అయితే అంబులెన్స్‌లోని పైభాగంలో సీక్రెట్ సెల్లార్‌లో ఈ మద్యం బాటిళ్లు దాచినట్లు తామ సోదాల్లో గుర్తించామన్నారు. దీంతో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం అంబులెన్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి.. డ్రైవర్‌ను విచారిస్తే.. అని విషయాలు వెల్లడించారని కాంతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీపక్ కుమార్ వెల్లడించారు. 2016లో బిహార్‌ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విధించిన సంగతి తెలిసిందే.

Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్

For National News And Telugu News

Updated Date - May 02 , 2025 | 07:47 AM