ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: వివేకా హంతకులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు?.. జగన్‌కు పల్లా సూటి ప్రశ్న

ABN, Publish Date - Mar 02 , 2024 | 03:44 PM

Andhrapradesh: మాజీ మంత్రి వివేక హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపైన విచారణ జరిపించాలని టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం తన తండ్రిని హత్య చేయించారని వైఎస్ సునీతారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో హంతకులకు ప్రజలకు మధ్య పోరాటం ఇదన్నారు.

విశాఖపట్నం, మార్చి 2: మాజీ మంత్రి వివేక హత్య కేసులో (Viveka Murder Case) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) పాత్రపైన విచారణ జరిపించాలని టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (TDP Parliamentary Party President Palla Srinivas) డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం తన తండ్రిని హత్య చేయించారని వైఎస్ సునీతారెడ్డి (YS Sunita reddy) స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో హంతకులకు ప్రజలకు మధ్య పోరాటం ఇదన్నారు. అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారనే స్పష్టంగా తెలుస్తోందని.. దీనిపైన జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Chandrababu: ఇది ఆరంభం మాత్రమే.. జగన్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!


జగన్ గొడ్డలి పోటు అని స్వయంగా ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. జగన్ గతంలో సీబీఐ (CBI) విచారణ కోరారు.. ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదని నిలదీశారు. వివేకానంద రెడ్డిని చంపిన హంతకులను ఎందుకు వెనక వేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారు. ఈ కేసులో ఎందుకు పురోగతి లేదని.. దీని వెనక ఐ ప్యాక్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు. సునీత న్యాయపోరాటానికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?


Viral: ఇది మరీ చిత్రం.. సన్నగా ఉన్నాడని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు.. కారణమేంటంటే..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 03:44 PM

Advertising
Advertising