Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?

ABN , Publish Date - Mar 02 , 2024 | 03:08 PM

Andhrapradesh: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్దం నాల్గోవ సభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో సిద్దం సభ పోస్టర్‌ను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసిందో సీఎం జగన్ సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు.

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?

ప్రకాశం, మార్చి 2: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్దం నాల్గోవ సభ (Siddam Sabha) నిర్వహిస్తున్నామని వైసీపీ (YSR Congress) రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి (YCP Regional Coordinator Vijayasai Reddy) తెలిపారు. శనివారం ఒంగోలులో సిద్దం సభ పోస్టర్‌ను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసిందో సీఎం జగన్ (CM Jagan) సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు. సిద్దం సభలో మేనిఫెస్టోని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఏమి చేశామో.. అనేది వివరిస్తామన్నారు. 15 లక్షల మంది సిద్దం సభకు హాజరవుతారన్నారు. 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే టార్గెట్‌తో వైసీపీ ముందుకు వెళ్తుందన్నారు. మార్చి 10 తరువాత నియోజకవర్గాలలో జగన్ పర్యటిస్తారన్నారు. సిద్దం సభకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు. సిద్దం సభల తరువాత పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని.. మార్చి 10 తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Chandrababu: ఇది ఆరంభం మాత్రమే.. జగన్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

AP Politics: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్‌... టీడీపీలోకి వేమిరెడ్డి



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 03:30 PM