Share News

Chandrababu: ఇది ఆరంభం మాత్రమే.. జగన్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

ABN , Publish Date - Mar 02 , 2024 | 02:48 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Chandrababu: ఇది ఆరంభం మాత్రమే.. జగన్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

నెల్లూరు, మార్చి 2: ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy) టీడీపీలో (TDP) చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి (TDP - Janasena) అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని.. ఎన్నికల కోడ్ వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు. వైసీపీ రౌడీలని రోడ్లపై తరిమికొట్టే రోజులు వస్తున్నాయన్నారు. విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తి విజయసాయిని నెల్లూరుకి పంపిస్తున్నారన్నారు. దోచుకున్న డబ్బుతో సిద్దం అంటూ హోర్డింగులా? అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్ల రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదని.. దేనికి సిద్దం... ఓడిపోవడానికి సిద్దమా అని ప్రశ్నించారు.

AP Politics: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్‌... టీడీపీలోకి వేమిరెడ్డి


‘‘85 మంది జాబితా విడుదల చేసి కిందాపైనా పడుతున్నారు. ఒకాయనకి అధికారంలో ఉన్నప్పుడు బట్టలు కూడా నిలవలేదు.. తంతే నరసరావుపేటలో పోయిపడ్డాడు. బుల్లెట్ దిగిందా? లేదా? పల్నాడులో తంతే చెన్నైకి పోతాడు. ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పదవులకంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని వచ్చేస్తున్నారు. గంగాధర్ నెల్లూరులో డిప్యూటీ సీఎంని మార్చారు. మంగళగిరిలో ఇప్పటికి ముగ్గురుని మార్చారు. ఇలాంటి పరిస్థితులు చూశామా? జగన్ ఒక మోసగాడు. తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నాడు. సీఎం సభల నుంచి జనం పారిపోకుండా పోలీసుల కాపాలనా?. ఆయన హెలికాఫ్టర్ లో వస్తే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. చెట్లు‌ నరికేస్తారు. ఊరికో సైకోని తయారు‌ చేశారు. మొన్ననే సోమిరెడ్డిపై ఒక సైకో గడ్డపారతో‌ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు గంటల్లో రౌడీల ఆటకట్టిస్తాం. హూ కిల్డ్ బాబాయ్?... వివేకా హత్య కేసు అయిదేళ్లుగా ఎందుకు తేలడం లేదు?. నిన్ననే చెల్లెలు అడిగింది. సమాధానం చెప్పడానికి సిద్దమా? గొఢ్డలిపోటుని గుండెపోటని ఎందుకు చెప్పావ్?... నీకూ సంబంధం ఉంది కాబట్టే గుండెపోటని చెప్పావు. సొంత చెల్లెలు షర్మిలాకి ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. ఎన్నికలకి ముందు గెలుపు కోసం వాడుకుని టిష్యూపేపర్‌లా తీసిపారేశాడు. నీ సొంత సోదరి, నీ తల్లి... నీ చెల్లెలు మీద నీచంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడతారా? కనీసం ఖండించారా? ఇంత నీచమైన, దగాకోరు రాజకీయాలా? నేరస్థులు, నేర స్వభావం ఉండేవారు‌ ఎంత నీచానికైనా దిగజారితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి’’ టీడీపీ అధినేత వ్యాఖ్యలు చేశారు.


పొత్తుపెట్టుకుంటే తప్పేంటి?..

‘‘మొన్న ఓ వ్యక్తి లారీ ఓనర్‌గా ఉండేవాడు క్లీనర్‌గా మారాడు. మరో వ్యక్తి అప్పులపాలై హోటల్ అమ్ముకుని, తోపుడు బండి పెట్టుకున్నాడు. రంగనాయకమ్మ ప్రశ్నించినందుకు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. గుంటూరు వదిలిపెట్టి హైదరాబాదుకి వెళ్లి పొట్ట పోసుకుంటుంది. చాలా మందిని వీళ్లే చంపేశారు. ఒక్క పల్నాడులో 30 మందిని హతమార్చారు. మంచినీరు అడిగినందుకు ఓ మహిళని ట్రాక్టర్ తో తొక్కించి హతమార్చారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపేశారు. ఈరోజు కులాలని రెచ్చగొడుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తుపెట్టుకుంటే వైసీపీకి బాదొచ్చింది. రాష్ట్రం కోసం పొత్తుపెట్టుకుంటే తప్పేంటి?. ఎవరికీ ఇవ్వని గౌరవం పవన్ కళ్యాణ్‌కు, జనసేన శ్రేణులకు ఇస్తున్నాం. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి కలిగాచుకునే రకం వీళ్లు. ఒక్కఛాన్స్ అంటూ ముద్దులు పెట్టి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఏ ఒక్క వర్గమైనా ఆనందంగా ఉన్నారా? అన్ని రంగాలు, అన్ని కులాలు దెబ్బతిన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యం ఉండే జిల్లా. రెడ్లకి న్యాయం చేసి గౌరవంగా చూసి ఉంటే నలుగురు రెడ్లు టీడీపీకి వస్తారా? అని చంద్రబాబు ప్రశ్నలు కురిపించారు.

Faridabad: ఇలాంటి వారికి శూల దండనమే కరెక్ట్.. పాపం నవజాత శిశువును ఏం చేశారంటే


తాడేపల్లి షేక్ అవుతోంది...

నెల్లూరు జిల్లాలో గనులు దోచేశారని... ఇసుక, సిలికా వంటివి మొత్తం దోచుకున్నారని ఆరోపించారు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి తప్పించి మరెవరు బాగుపడలేదన్నారు. ఉమ్మడి నెల్లూరులో పదికి పది గెలిపించడానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. పాలూ నీళ్లులా కలిసిపోయారన్నారు. మాజీ మంత్రి నారాయణను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో‌ చూస్తున్నామని.. గట్టిగా పోరాడుతున్నారని తెలిపారు. సర్వే రిపోర్టులు చూస్తే... వీపీఆర్‌కు మంచి ఫలితాలొచ్చాయన్నారు. 99 సీట్లు కేటాయించాక, తాడేపల్లి కొంపలో భయపడిపోయారన్నారు. తాడేపల్లి మొత్తం షేక్ అవుతోందని.. అభ్యర్ధులని మార్చేస్తున్నారని.. ఏ ఒక్కరూ గెలిచే పరిస్థితులు లేవన్నారు. అధికారులు తప్పుడు పనులు చేస్తే, జగన్‌తో‌ పాటే ఇబ్బందులు పడతారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Mallareddy: నన్ను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు

PM Modi: రూ.34 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం.. ఎక్కడంటే..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...


Updated Date - Mar 02 , 2024 | 03:07 PM