Cold Wave: వణికిస్తున్న కోల్డ్‌వేవ్.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. భయాందోళనలో ప్రజలు
ABN, Publish Date - Dec 20 , 2025 | 08:22 AM
కర్నూలు జిల్లా ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ చలి తీవ్రత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
వణికిస్తున్న చలి
కనిష్ఠ స్థాయికి చేరుకున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాయంత్రం వేళల్లో కమ్మేస్తున్న పొగమంచు
చర్మ వాధులకు గురవుతున్న ప్రజలు
కొలిమిగుండ్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా (Kurnool District) ప్రజలను చలి గజగజ (Severe Cold Wave) వణికిస్తోంది. రోజు రోజుకూ చలి తీవ్రత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కొలిమిగుండ్ల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల కనిష్ఠ స్థాయి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రెండు, మూడు రోజులుగా సాయంత్రం 5గంటల నుంచే పొగ మంచు కమ్ముకుంటుంది. ఉదయం సూర్యుడు కనిపించి ఎండ కాస్తున్నా 11గంటల వరకూ చలి తీవ్రత తగ్గడంలేదు. చిన్న పిల్లలు, వృద్ధులు చర్మ వ్యాధులకు గురవుతున్నారు. సాయంత్రం నుంచే చలి తీవ్రంగా ఉండటంతో బయటికి రావడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. దీంతో వివిధ వర్గాల కార్మికులు, రైతులు ఉదయం పనులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 11:05 AM