ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Maganti Gopinath: టీడీపీతోనే మాగంటి పొలిటికల్ ఎంట్రీ

ABN, Publish Date - Jun 08 , 2025 | 10:00 AM

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం ఉంచారు. ఆస్పత్రి నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఇంటికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం ఉంచారు. ఆస్పత్రి నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఇంటికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987,1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా పని చేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.


2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్‌పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2022న బీఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

అది ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు

హైదరాబాద్‌లో 4 ట్రాన్సిట్‌ కారిడార్లు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 10:20 AM