Temple Submerged Near PuranaPul: మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన శివాలయం..
ABN, Publish Date - Sep 27 , 2025 | 12:54 PM
మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు.
హైదరాబాద్: మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు. నిన్న ఒక్కసారిగా వరదరావడంతో నలుగురు ఆలయ సిబ్బంది ఆలయంలోనే ఇరుక్కుపోయారు. ఆలయంలో చిక్కుకున్న వారిని మహేందర్, రాజు, ఆకాష్, జగ్గు భాయ్‌గా అధికారులు గుర్తంచారు. అయితే బాధితుల్లో ఓ పూజారి కూడా ఉన్నాడు. వరద ఒక్కసారిగా రావడంతో గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. సమాచారం అందుకున్న హైడ్రా, డీఆర్ఎఫ్ వారిని రక్షించేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు
Updated Date - Sep 27 , 2025 | 12:57 PM