Siddipet: బీఆర్ఎస్ సభ నుంచి వస్తున్న వాహనం ఢీకొని ఇద్దరి మృతి
ABN, Publish Date - Apr 28 , 2025 | 03:57 AM
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నుంచి వస్తున్న ఓ జీపు(తుఫాన్) ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
సిద్దిపేట జిల్లా రాంపూర్ క్రాసింగ్ వద్ద రోడ్డు ప్రమాదం
నంగునూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నుంచి వస్తున్న ఓ జీపు(తుఫాన్) ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన తాడం సారయ్య(36), బండోజు గణేష్ (32)వడ్రంగి పని చేస్తుంటారు. సిద్దిపేటలో పని ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు.
అయితే, బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నుంచి వస్తున్న నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన తుఫాన్ వాహనం.. రాంపూర్ క్రాసింగ్ వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో సారయ్య అక్కడికక్కడే మరణించగా, గాయపడిన గణేష్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఇక, ఈ రోడ్డు ప్రమాదం వల్ల రహదారిలో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ తరఫున రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News
Updated Date - Apr 28 , 2025 | 03:57 AM