Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:46 PM
Rains: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలంలో భారీ వర్షం కురిసింది.

కర్నూలు, ఏప్రిల్ 27: ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలం నదిచాగి, మేలగనూరు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ యా గ్రామాల్లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు నిలిచింది. దీంతో కళ్లాలో ఆరబోసిన వరి ధాన్యం నీట మునిగింది. దీంతో ఆ యా గ్రామాలకు చెందిన రైతులు కన్నీటి పర్యంతమవుతోన్నారు.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు పడతాయని.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.శుక్రవారం మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తులో విస్తరించనుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దీని ఫలితంగా బలమైన ఈదురు గాలులు సైతం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..
For AndhraPradesh News And Telugu News