Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
ABN , Publish Date - Apr 27 , 2025 | 06:35 PM
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా ఆలూరులో ఆయనను ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు.

అనంతపురం, ఏప్రిల్ 27: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆలూరులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ని ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులు ఈ హత్యపై సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొన్నారు. అనంతరం లక్ష్మీనారాయణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. మృతుడు లక్ష్మీ నారాయణపై గతంలో అనేక కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. ఆలూరిలోని వైకుంఠం శ్రీరాములు అనే వ్యక్తి హత్య కేసులో అతడు ప్రధాన నిందితుడని చెప్పారు. గుంతకల్లులో సెటిల్‌మెంట్లు దందాల కోసం లక్ష్మీనారాయణ కార్యాలయం సైతం ఏర్పాటు చేసుకున్నాడని వివరించారు. అయితే ఓ సెటిల్‌మెంట్ చేసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లున్న సమయంలో కాపు కాచి ప్రత్యర్థులు అతడిని హత్య చేశారన్నారు.
స్పందించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..
కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీనారాయణ దారుణ హత్యపై ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్య ఘటన తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. లారీతో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి ఆయనను చంపారని తెలిపారు. ఈ హత్య ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. ఈ హత్యపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఈ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
For AndhraPradesh News And Telugu News