TDP Vs YCP: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:41 PM
TDP Vs YCP: వైసీపీలో జరిగిన అవినీతి భాగోతాలను వరుసగా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వెలికి తీస్తోంది. తిరుపతి లడ్డు తయారీలో జంతు అవశేషాలకు చెందిన పదార్థాలు వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో.. ఈ వ్యవహారంపై ప్రభత్వం సిట్ ఏర్పాటు చేసింది.

కాకినాడ, ఏప్రిల్ 27: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని పలువురు నేతల నుంచి కేడర్ వరకు చేసిన అవినీతి, అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లకే పరిమితమైంది.దీంతో ఆ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ప్రతిపక్షహోదా సైతం దక్కలేదు. అలాంటి వేళ.. ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు గుండాల తీరుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. టీడీపీ కార్యకర్తకు చెందిన భూమిని కాజేసేందుకు పన్నాగం సైతం పన్నారు. అందులోభాగంగా వైసీపీ కార్యకర్తలు కాస్తా గుండాలుగా మారి వీరంగం సృష్టించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దపురంకు చెందిన టీడీపీ కార్యకర్త జార్జీ చక్రవర్తికి 2.54 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కాజేసేందుకు పెద్దాపురంలోని వైసీపీ కార్యకర్తలు భారీ స్కెచ్ వేశారు. అయితే ఆదివారం తన పొలంలో జార్జ్ చక్రవర్తి .. పంట కోత కోస్తున్నారు. ఆ సమయంలో అతడిపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. దీంతో జార్జ్ చక్రవర్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి వీపు భాగంలో పలు కత్తిపోట్లు పడ్డాయి. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిపై పోలీసులకు సమాచారం అందడంతో.. వారు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందంటూ జార్జ్ చక్రవర్తితోపాటు ప్రత్యక్ష సాక్షులను వారు ప్రశ్నించారు. తనపై స్థానిక వైసీపీ కార్యకర్తలు వెన్న విజయ్ చక్రవర్తి, వైసీపీ కౌన్సిలర్ ఆరేళ్ల రాఘవ, పెదిరెడ్ల నాని, ఐతి మేరీ, కొత్తపల్లి సాయి కుమార్ దాడి చేశారని జార్జ్ చక్రవర్తి.. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో ఈ వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యం, కొట్లాటల కేసులు సైతం నమోదయ్యాయని పోలీసులు వివరించారు.
మరోవైపు వైసీపీలో జరిగిన అవినీతి భాగోతాలను వరుసగా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వెలికి తీస్తోంది. తిరుపతి లడ్డు తయారీలో జంతు అవశేషాలకు చెందిన పదార్థాలు వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో.. ఈ వ్యవహారంపై ప్రభత్వం సిట్ ఏర్పాటు చేసింది. అలాగే మద్యం కుంభకోణం అంశంపై దర్యాప్తు జరగుతోంది. ఇక ముంబై నటి వ్యవహారంలో వైసీపీ నేతతోపాటు పలువురు ఐపీఎస్‌లపై ఆరోపణలు రావడంతో.. వారు సైతం పోలీసులు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇంకోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడి.. మరణించాడు. ఈ నేపథ్యంలో ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసింది. అలాగే వీరయ్య చౌదరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబుతోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు పరామర్శించి.. ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..
For AndhraPradesh News And Telugu News