AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:25 PM
AP Police: పోలీసులను చూసిన దొంగ ఏం చేస్తాడు. ఆ దొంగ అదే చేశాడు. రెండస్తుల భవనంపై నుంచి దూకి పారిపోయాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విజయవాడ, ఏప్రిల్ 27: పోలీసులను చూసిన తర్వాత ఏ దొంగ అయినా పారిపోతాడు. ఈ దొంగ కూడా అలాగే చేశాడు. కానీ రెండస్తుల భవనంపై నుంచి దూకి.. పారిపోయాడు. రెండస్తుల భవనంపై నుంచి కిందకి దిగిన పోలీసులకు దొంగ అక్కడ అదృశ్యం కావడంతో..అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రాయుడు దుర్గారావుపై అనేక చోరీ కేసులు.. పలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ 15వ తేదీ అర్థరాత్రి వాంబే కాలనీలో షాపు తాళాలు పగులకొట్టి.. రూ. 1.60 లక్షల నగదు చోరీ చేశాడు. ఈ దొంగతనం అనంతరం అతడు ఒడిశాకు పారిపోయాడు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే అజిత్ సింగ్ నగర్ షాదీ ఖానా పక్క వీధిలో పెంట్ హౌస్‌కు దుర్గారావు అద్దెకు తీసుకున్నాడు.
మరోవైపు ఈ చోరీపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఆ క్రమంలో ఈ చోరీకి పాల్పడింది దుర్గరావుగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు ఆదివారం ఒడిశా నుంచి విజయవాడలోని తన ఇంటికి చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అతడిని పట్టుకొనేందుకు పోలీసులు అజిత్ సింగ్ నగర్‌లోని అతని నివాసానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన అతడు అద్దెకుంటున్న రెండస్తుల భవనంపై నుంచి దూకి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అందులోభాగంగా అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
For AndhraPradesh News And Telugu News