ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Uttam: కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం

ABN, Publish Date - May 04 , 2025 | 02:03 PM

Minister Uttam: తెలంగాణలో చేసిన బీసీ గణనను కేంద్రం అవలంబిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే, జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Minister Uttam Kumar Reddy

సూర్యాపేట : వడ్డెర కులస్తులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. వడ్డెర కులస్తులకు తమ ప్రభుత్వంలో పెద్దపీట వేయబోతున్నామని అన్నారు. ఇవాళ(ఆదివారం) కోదాడ పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... దేశంలో మొట్టమొదటిగా బీసీ కుల గణనను తెలంగాణ పూర్తి చేసిందని అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.


తెలంగాణలో చేసిన బీసీ కులగణనను కేంద్రం అవలంబిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే, జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అలాగే కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెడ్లకుంట, శాంతినగర్, పాలేరు-మోతె ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గంలోని ఎన్‌ఎస్పీ కాల్వలపై కూడా అధికారులతో మాట్లాడారు. అధికారుల పని తీరుపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.


దేశంలో సమగ్రమైన కులగణన జరగాలి: గిడుగు రుద్రరాజు

ఢిల్లీ: దేశంలో సమగ్రమైన కులగణన జరగాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. ఇవాళ(ఆదివారం) ఢిల్లీ వేదికగా గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. 1951లో జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కులగణనను వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడితో కేంద్రం కులగణన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆర్టికల్ 15 (5)ను బలహీన వర్గాలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కల్పించిందని.. దీనిని మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అమలు పరచడం లేదని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు.


ఆర్టికల్ 15 (5)ను బలహీన వర్గాలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు అమలు పరచాలని గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం సమగ్రమైన కులగణన జరిపిందని చెప్పారు. ప్రజల నుంచి సమగ్ర వివరాలను రేవంత్ ప్రభుత్వం కులగణన ద్వారా తెలుసుకుందని అన్నారు. 2011లో జరిగిన జనాభా లెక్కల వివరాలను పార్లమెంట్ ముందు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉంచలేదని నిలదీశారు. కోవిడ్ సాకుతో 2021లో మోదీ ప్రభుత్వం జనగణన చేయలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన జరపాలని కోరారు. మే చివరి వరకు దేశవ్యాప్తంగా సంవిదాన్ బచావో ర్యాలీలో భాగంగా కుల గణనపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కులగణన ఎప్పటి వరకు పూర్తి చేస్తారో మోదీ ప్రభుత్వం స్పష్టం చేయాలని గిడుగు రుద్రరాజు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అండ

Ponnam Prabhakar: ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచే చాన్స్‌

Ration Misuse: బియ్యం అమ్ముకుంటే రేషన్‌ కార్డు రద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2025 | 02:25 PM