Bhoodan Pochampally: సుందరీమణుల మనస్సు దోచిన చేనేత అందాలు
ABN, Publish Date - May 15 , 2025 | 10:15 PM
Bhoodan Pochampally: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు వచ్చిన సుందరీమణులు తెలంగాణలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు గురువారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు.
నల్గొండ, మే 15: మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులు మనస్సును భూదాన్ పోచంపల్లిలోని చేనేత చీరల డిజైన్లు కట్టిపడేశాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు గురువారం భూదాన్ పోచంపల్లిలోని గ్రామ చేనేత పార్క్‌ను సందర్శించారు. ఇక్కడి స్థానిక సంస్కృతి, కళలుతోపాటు సంగీతం విని వారు మైమరచిపోయారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానించేందుకు పలు కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి చూసి వారు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ కార్యక్రమాలు వారిని కట్టిపడేశాయి. ఈ సందర్భంగా పార్క్ మ్యూజియంలోని స్టాళ్లను వారు సందర్శించారు. ప్రత్యేకమైన ఇక్కడి చీరల తయారీ విధానాన్ని స్థానికులను వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఒక్క చీర తయారీ కోసం ఎంత కాలం పడుతుందంటూ వారు చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు.
ఇక స్థానిక కళాకారులు ప్రదర్శించిన కిన్నెర, డప్పు వాయిద్యాలు నుంచి వెలువడిన మధుర సంగీతం సుందరీమణులను మంత్రముగ్ధుల్ని చేసింది. కొందరు కంటెస్టెంట్‌లు స్వయంగా కిన్నెర, డప్పు వాయించగా, మరికొందరు సంగీతానికి లయబద్దంగా నాట్యం చేశారు.
అలాగే కంటెస్టెంట్లు.. స్థానిక కళాకారులతో మెహందీ, టాటూలు వేయించుకున్నారు. అరి చేతులపై నెమలి సోయగం, నాజూకైన నక్షత్రాలు, పువ్వుల డిజైన్లతో మురిసిపోయిన ఈ బ్యూటీలు.. ఫోటో సెషన్లకు సైతం ఫోజ్ ఇచ్చారు. చివరగా అంపి థియేటర్లో భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియోను మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లకు ప్రదర్శించారు. దీనిని వారు చాలా ఆసక్తిగా తిలకించారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు రూరల్ టూర్ నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని జిల్లా యంత్రాగం పూర్తిగా అర్థం చేసుకుంది. అందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించింది. మిస్ వరల్డ్‌లో పాల్గొనే సుందరీమణులు హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం హనుమంత రావు నేతృత్వంలో పోచంపల్లి గ్రామ చేనేత పార్క్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ చేనేత పార్క్‌కు ప్రపంచానికి పరిచయం చేసేలా వరల్డ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు దక్కేలా ఆయన చక్కగా ప్రమోట్ చేశారు. ఈ చేనేత పార్క్‌లో సుందరీమణులు దాదాపు 3 గంటలకు పైగా ఉన్నారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు చాలా ఆసక్తిగా పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Mannava Mohan krishna: రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు: చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుందరీమణులు
Nawaz Basha: బస్సు కండెక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి
Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Metro Rail: ప్రయాణికులపై మెట్రో బాదుడు
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News
Updated Date - May 15 , 2025 | 10:15 PM