Nawaz Basha: బస్సు కండెక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి
ABN , Publish Date - May 15 , 2025 | 07:50 PM
Nawaz Basha: వైసీపీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే వార్తల్లోకెక్కాడు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన కండక్టర్‌పై దాడి చేశాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది.
అన్నమయ్య, మే 13: వైసీపీ అధికారాన్ని కోల్పోయినా.. ఆ పార్టీ నేతలు మాత్రం దుందుడుకు వైఖరిని వీడడం లేదు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు కీలక నేతలపై వివిధ పోలీస్ స్టేషనలలో కేసులు నమోదయ్యాయి. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రెచ్చిపోయారు. తన బస్సు కంటే ముందే వెళ్తారా అంటూ..మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్ హరినాథ్‌పై దాడి చేశాడు.
గురువారం మదనపల్లి పట్టణంలో బెంగళూరు బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడితో తీవ్రంగా గాయపడిన హరినాథ్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. అలాగే పలువురు నాయకులపై సైతం కేసులు నమోదయ్యాయి. అందులోభాగంగా వారంతా విచారణను ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. ఇలా మదనపల్లికి చెందిన నవాజ్ బాషా.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్‌పై దాడి చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులుగా గల రాష్ట్రాలకు ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ట్రావెల్స్ మధ్య ఓ విధమైన పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Metro Rail: ప్రయాణికులపై మెట్రో బాదుడు
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For AndhraPradesh News And Telugu News