ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Raghunandan Rao: వారిపై భౌతిక దాడులు చేస్తే ఊరుకోం.. రఘునందన్‌రావు మాస్ వార్నింగ్

ABN, Publish Date - Jun 02 , 2025 | 02:29 PM

ఉద్దేశపూర్వకంగా కొంతమంది హిందువుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

MP Raghunandan Rao

సిద్దిపేట: హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన ముస్లింలు గోవధ చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తెలిపారు. ఇవాళ(సోమవరం) సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో ఓ వర్గం చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న బజరంగ్‌దళ్ నాయకులు రాజారాంను ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రతి బక్రీద్ పండుగ వచ్చినప్పుడు దాడులు, గోవధ చేయడం ఆనవాయితీగా మారిందని చెప్పారు ఎంపీ రఘునందన్ రావు.


ఈ దేశంలో మెజార్టీ ప్రజలు గౌరవిస్తున్న గోమాత విషయంలో వారు మానవత్వంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కొంతమంది వ్యక్తులు కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని చెప్పుకొచ్చారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగిందని గుర్తుచేశారు. చట్టం ప్రకారం పోలీసులు వారి పని చేయాలని, ఒక వర్గానికి వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు సరిగా విధులు నిర్వహించక పోవడంతోనే హిందూ సంఘాల నాయకులు గోవులను రక్షిస్తున్నారని తెలిపారు ఎంపీ రఘునందన్ రావు.


నిన్న రాత్రి జరిగిన సంఘటనలు కావాలని ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. హిందువులను చైతన్య పరుస్తున్న రాజారాంపై భౌతిక దాడి చేసేందుకు కొంతమంది ప్రయత్నించారని మండిపడ్డారు. వారే ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఏమిటని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం రాజారాంకు భద్రత కల్పించాలని కోరారు ఎంపీ రఘునందన్ రావు.


గత ఏడాది మెదక్‌లో బక్రీద్ పండుగకు 25 మంది హిందువులను రిమాండ్ చేసిన సంఘటనను ఎంపీ రఘునందన్ రావు గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెన్సిటివ్ ఉన్న ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు చూసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మావోయిస్టులపై మారణహోమం ఆపాలి

జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2025 | 03:00 PM