Yoga Event: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో యోగా కార్యక్రమం
ABN, Publish Date - Jun 20 , 2025 | 08:55 PM
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ యుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. తెలంగాణ యుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. యోగా నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షించారు. యోగాడే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖకు చెందిన యోగా శిక్షకులు, మెడికోలు, వివిధ పాఠశాలలకు చెందిన 5500 విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉదయం అల్పాహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
యోగా కార్యక్రమ వివరాలివే..
ఉదయం 6.20 గంటల నుంచి 6.30 వరకు స్టేడియంలో యోగా ఫొటో ఎగ్జిబిషన్
6.30 నుంచి 7.00 గంటల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం వీక్షణ
7.00 నుంచి 7.45 వరకు యోగా కార్యక్రమం.
7.45 నుంచి 7.50 వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను వేదిక పైకి ఆహ్వానం.
7.50 నుంచి 8.00 వరకు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ ప్రసంగం.
8.00 నుంచి 8.05 వరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగం.
8.05 నుంచి 8.15 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం.
8.15 నుంచి 8.20 వరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం.
అనంతరం 8.20 నుంచి 8.30 గంటల వరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా బెలూన్లను అతిథులు ఆకాశంలో వదులుతారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్‌డే శుభాకాంక్షలు
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 09:01 PM