Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
ABN, Publish Date - May 03 , 2025 | 02:52 PM
Minister Ponguleti Srinivas Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదోడి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: పేదోడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రూ.22వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (NAC)లో శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ(శనివారం) సర్టిఫికెట్లు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో 350 మంది ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆరు రోజులపాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and Telugu News
Updated Date - May 03 , 2025 | 02:58 PM