Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
ABN , Publish Date - May 03 , 2025 | 06:34 AM
బంగారం, వెండి ప్రియులకు మళ్లీ శుభవార్త వచ్చేసింది. వరుసగా రెండో రోజు ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొనుగోలు చేయాలనుకున్న వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు మళ్లీ మంచి ఛాన్స్ వచ్చింది. వరుసగా రెండో రోజు వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నేడు (మే 3న) గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.170 తగ్గి, రూ. 95,550కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,540 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 95,650కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 87,690కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలతో పాటు దేశీయ పరిస్థితులు కూడా వీటి ధరల తగ్గుదలకు కారణం అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
నేటి వెండి ధరలు
మరోవైపు వెండి ధరలు కూడా స్పల్పంగా కిలోకు 100 రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.97,900కు చేరుకోగా, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ.109,100 స్థాయికి చేరుకుంది. ముంబైలో రూ.97,900, చెన్నైలో రూ.109,100, జైపూర్‌లో రూ.97,900, పూణేలో రూ.97,900, కేరళలో రూ.109,100 స్థాయికి చేరుకుంది. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్ మొదలైన తర్వాత వీటి రేట్లలో మార్పు వస్తుంది.
బంగారం ధరలు ఇంకా తగ్గే ఛాన్సుందా..
అంతర్జాతీయ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు వంటి అంశాలు బంగారం డిమాండ్‌ను పెంచుతాయి. ఇది క్రమంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కూడా దీనిపై ప్రభావం చూపిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే, డాలర్ విలువ తగ్గి బంగారం ధరలు పెరిగే ఛాన్సుంది. వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే లేదా పెరిగితే ధరలు తగ్గవచ్చు. 2025లో బంగారం డిమాండ్ తగ్గి, ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే బంగారం ధరలు స్వల్పకాలంలో మరికొంత తగ్గే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Bill Gates: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌కు అరుదైన వ్యాధి
Read More Business News and Latest Telugu News