ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

ABN, Publish Date - Jun 17 , 2025 | 03:18 PM

Phone Tapping Case: ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా ఉండలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని మండిపడ్డారు.

Phone Tapping Case

హైదరాబాద్, జూన్ 17: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం టీపీసీచీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది నాయకుల ఫోన్లను చట్టానికి వ్యతిరేకంగా ట్యాప్ చేశారని మండిపడ్డారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఆనాటి సీఎం, కేటీఆర్‌లు సిగ్గుతో తలవంచుకోవాలని వ్యాఖ్యలు చేశారు.

ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా ఉండలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని మండిపడ్డారు. 2022 నుంచి కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమన్నారు. ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తికి అధికారాన్ని కట్టుబట్టి తమ ఫోన్‌‌లను టాప్ చేయించారని ఆరోపించారు. నక్సలైట్ల సానుభూతిపరుల పేరుతో తమ ఫోన్లు టాప్ జరిగాయన్నారు. ఈనాడు కేటీఆర్‌ తాము నీతివంతులం, నిజాయితీపరుమలని అంటున్నారని.. ఆయన సిగ్గుతో తలవంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య అని అన్నారు.

తమ ఫోన్లను ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు. నిజాయితీ గల సిట్‌ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే ఈ కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఎవ్వరినీ ఉపేక్షించవద్దన్నారు. విచారణను సజావుగా జరిపి ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన వారికి శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వానికి వినతి చేశారు. దేశ చరిత్రలో ఇంత మంది ఫోన్లు ట్యాప్ చేయడం ఇదే ప్రథమమన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితులను శిక్షించాలని కోరారు. ఆనాటి నేతలు వారి అవసరాల కోసం రాజకీయ నాయకులు, జడ్జిలు, విలేకర్లలతో పాటు వారి హయాంలో పని చేసిన అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి అవసరాలకు అనుగుణంగా ఫోన్‌ ట్యాపింగ్‌ను వాడుకుందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి హార్డ్ డిస్క్‌లను ప్రభాకర్ రావు ధ్వంసం చేయించారన్నారు. ప్రభాకర్ రావు, అప్పటి చీఫ్ సెక్రటరీ కలిసి హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

పూజల పేరుతో దారుణం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 04:56 PM