Share News

Crime News: పూజల పేరుతో దారుణం..

ABN , Publish Date - Jun 17 , 2025 | 07:41 AM

Crime News: మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి కొందరు ఊబిలోకి నెట్టుకుంటున్నారు. ఏ మతం అయినా, ఏ ఆచారం అయినా నమ్మడం తప్పు కాదు.. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ మూఢ నమ్మకాలు, మితిమీరిన ఆశలతో చెడు దారుల్లోకి వెళ్ళడం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది.

Crime News: పూజల పేరుతో దారుణం..
Crime News

Bangalore: ప్రస్తుత కాలంలో సైన్స్ (Science), సాంకేతికత (Technology) ఎంతో అభివృద్ధి (Development) చెందింది. దానికనుగుణంగా మనుషులు కూడా మారుతున్నారు. మనుషులు ఎంత మారుతున్నా.. ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మానవ మనుగడను విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల (Superstition) ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు. ఏ మతం అయినా, ఏ ఆచారం అయినా నమ్మడం తప్పు కాదు.. అది వారి వ్యక్తిగత నిర్ణయం కానీ మూఢ నమ్మకాలు, మితిమీరిన ఆశలతో చెడు దారుల్లోకి వెళ్ళడం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే బెంగళూరు (Bangalore)లో జరిగింది. పూజలు చేసి మీ సమస్యలను తొలగిస్తామని బెంగళూరుకు చెందిన ఓ మహిళను కేరళ (Kerala)కు చెందిన పూజారి (Priest) నమ్మించి మోసం చేశాడు. ఆమెతో నగ్న పూజలు చేయించాడు. బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆమెకు మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి.


పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు చెందిన ఓ మహిళ తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఏమైనా పూజలు చేస్తే తన సమస్యలు తొలగుతాయని భావించిన ఆమె కేరళలోని ఓ ఆలయానికి వెళ్లి పూజలు చేసింది. సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే ప్రత్యేక పూజలు చేయాలని.. అందుకు సిద్ధమైతే ఏర్పాట్లు చేస్తామని ఆ ఆలయ పూజారి అరుణ్‌ చెప్పేసరికి ఆమె కాదనలేక పోయింది. అతనిని పూర్తిగా నమ్మింది. ఆ పూజారి చెప్పినట్టుగా చేయక తప్పలేదు. ఒంటిపై నూలుపోగైనా లేకుండా పూజల్లో పాల్గొనేలా పూజారి చేశాడు. అయితే ఆమె సమస్యలు తీరకపోగా.. మరిన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. బెంగళూరుకు తిరిగొచ్చిన ఆమెను.. పూజలు కొనసాగించాలని.. మళ్లీ కేరళకు రావాలని పూజారి చెప్పాడు. దీంతో ఆమె ఇక పూజలు వద్దని చెప్పింది.


దీంతో పూజారి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. పూజ కోసం కేరళ రాకపోతే.. ఇంతకు ముందు చేసిన నగ్న పూజను అందరికీ చూపిస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె మళ్లీ కేరళ ఆలయంలో అడుగు పెట్టింది. ఇక.. అక్కడి నుంచి పూజారి ఆమెను లోబరుచుకుని వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు. చెప్పినప్పుడల్లా కేరళకు రాకపోతే ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో ఉంచుతామని బెదిరించడంతో ఆమె బెళ్లందూరు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు పూజరి అరుణ్‌ను అరెస్టు చేసి.. బెంగళూరుకు తీసుకువచ్చారు. అతనికి సహకరిస్తున్న దామోదరన్‌ అనే మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

రైల్వేలో 6,374 పోస్టుల భర్తీకి చర్యలు

ఎవరా ఐఏఎస్‌‌లు..?

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 17 , 2025 | 12:29 PM