ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nandamuri Balakrishna: నన్ను చూసుకొనే.. నాకు పొగరు, దర్పం

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:57 PM

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Nandamuri Balakrishna

హైదరాబాద్: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఇవాళ(మంగళవారం) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలయ్య పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు.

ఈసారి బర్త్ డే ప్రత్యేకం..

‘మా నాన్న హీరో అవుతానని అనేవారు. అలాంటిది ఓ రోజు మెడిసన్ ఎగ్జామ్‌కు అప్లయ్ చేయమన్నారు. నిజజీవితంలో డాక్టర్ కాకపోయినా.. సింహా సినిమాలో వైద్యుడిగా నటించాను. ప్రతి ఏడాది జన్మదినోత్సవం జరుపుకుంటాను. కానీ ఈసారి నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవటం.. పద్మభూషణ్ అవార్డ్ నాకు రావటం ప్రత్యేకం..వరుసగా నేను చేసిన నాలుగు సినిమాలు హిట్స్ అయ్యాయి. గతంలో నేను ఓ మాట అన్నాను.. ఇకనుంచి నేనేంటో చూపిస్తానని.. ఇతనికీ అంత తెలుసా.. పొగరా అనుకుంటారేమో.. నా గురించి నేను తెలుసుకోవటం కంటే పెద్ద విద్య ఎముంటుంది.. నాకు పొగరే.. నన్ను చూసుకునే నాకు పొగరు.. దర్పం.. మనిషికి పట్టుదల క్రమశిక్షణ ఉండాలి. అఖండ -2 చిత్రీకరణ కోసం జార్జియాలో మైనస్ 4 డిగ్రీల వాతావరణంలో స్లీవ్ లెస్ షర్ట్‌తో నటించా.. నటుడిగా అది నా బాధ్యత’ అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

కాచిగూడకు సరికొత్త వెలుగు

బస్‌పాస్‌ చార్జీల బాదుడు

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 10 , 2025 | 01:16 PM