ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Prabhakar: ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక విజ్ఞప్తి

ABN, Publish Date - May 06 , 2025 | 10:11 AM

Minister Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు. కార్మికులు సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Minister Ponnam Prabhakar

హైదరాబాద్: ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనను విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఇవాళ(మంగళవారం) మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ని ఆర్టీసీ ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి , వైస్ చైర్మన్ అబ్రహం కలిశారు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కి ఆర్టీసీ సంఘాల నేతలు వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రభాకర్‌ తెలిపారు. ఏ సంఘాలు అయినా తమతో ఆర్టీసీ సమస్యలపై చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం లేఖ..

ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం ఇవాళ(మంగళవారం) మరోసారి బహిరంగ లేఖ రాసింది. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరింది. ’సమ్మె పేరుతో లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయొద్దు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఉద్యోగుల స‌మస్యల పరిష్కారానికి యాజ‌మాన్యం కట్టుబడి ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోన్న సంస్థ‌కు, ఉద్యోగుల‌కు స‌మ్మె అనేది తీర‌ని న‌ష్టం క‌లిగిస్తుంది. స‌మ్మె అనేది స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. 2019లో జ‌రిగిన స‌మ్మె వ‌ల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయ‌బ‌డింది’ అని లేఖలో యాజమాన్యం ప్రస్తావించింది.


స‌మ్మె శ్రేయ‌స్క‌రం కాదు...

‘కార్మికుల స‌మష్టి కృషి వ‌ల్ల అన్ని సంక్షోభాల‌ను ఎదుర్కొని.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు చూరగొంటున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ్మె అనేది శ్రేయ‌స్క‌రం కాదు. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాట‌ల‌కు ప్ర‌భావిత‌మై స‌మ్మెకు వెళ్తే సంస్థ‌తో పాటు ఉద్యోగుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది. ఆర్టీసీ సంస్థ‌ను అన్ని తామై ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డ‌టం లేదు. సంస్థ‌కు వ‌చ్చే ప్ర‌తి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చిస్తాం. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైనది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించిన, విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..

Helicopter Ride: సరస్వతి పుష్కరాల్లో ‘జాయ్‌ రైడ్‌’

NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 10:31 AM