ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

ABN, Publish Date - Jun 15 , 2025 | 02:02 PM

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.

Basara Tragedy incident

నిర్మల్: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో యువకులు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు. వీరిలో ఐదుగురు యువకులు గోదావరిలో మునిగి మృతిచెందారు.

ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాకేష్, వినోద్, మదన్, రితిక్‌గా గుర్తించగా.. మరో యువకుడు భరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యువకులు మునిగిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్

ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 02:27 PM