Virat Kohli Pension: టెస్టులకు గుడ్‌బై.. కోహ్లీకి దక్కే పెన్షన్ ఎంతంటే..
ABN, Publish Date - May 12 , 2025 | 12:47 PM
BCCI: భారత స్టార్ బ్యాట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. రూమర్లనే నిజం చేశాడు కింగ్. 14 ఏళ్ల టెస్టు కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. దీంతో విరాట్ టెస్ట్ ఇన్నింగ్స్‌లను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.
14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్, 123 టెస్టు మ్యాచుల అనుభవం, 9,230 పరుగులు, 30 సెంచరీలు.. ఈ లెక్కలు చాలు లాంగ్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ ఎంత తోపో చెప్పేందుకు. గత దశాబ్ద కాలంలో వరల్డ్ క్రికెట్‌ను శాసించిన ఈ టీమిండియా బ్యాటర్.. వన్డేలతో పాటు టెస్టుల్లోనూ దుమ్మురేపాడు. అలాంటోడు లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇక నుంచి వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు. సుదీర్ఘ కెరీర్‌లో తనకు సహకరించిన బీసీసీఐ, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్‌కు అతడు థ్యాంక్స్ చెప్పాడు. విరాట్ రిటైర్మెంట్‌తో భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, ఆడిన బ్యూటిఫుల్ నాక్స్‌ను అభిమానులు తలచుకుంటున్నారు. ఇదే టైమ్‌లో కింగ్‌కు దక్కే పెన్షన్ ఎంతనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. మరి.. విరాట్‌కు వచ్చే పెన్షన్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..
ఎంత ఇస్తారంటే..
బీసీసీఐ ఆటగాళ్ల శ్లాబులను బట్టి శాలరీలు, ప్రాతినిధ్యం వహించిన మ్యాచులను బట్టి పెన్షన్‌లు అందిస్తుంది. ఏ-ప్లస్ గ్రేడ్ కలిగిన విరాట్ కోహ్లీ బోర్డు నుంచి ఏడాదికి రూ.7 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. కెరీర్ మొత్తంలో టీమిండియా తరఫున 123 టెస్టుల్లో ఆడాడు కింగ్. బీసీసీఐ రూల్స్ ప్రకారం 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్లకు నెలకు రూ.70 వేల పెన్షన్ ఇస్తారు. కాబట్టి కోహ్లీ కూడా అంతే మొత్తాన్ని అందుకుంటాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. అర్హుడే అయినా బీసీసీఐ నుంచి కోహ్లీకి పెన్షన్ రాదు. టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఇకపై వన్డేల్లో కొనసాగనుండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
ఆదాయం డౌన్
కోహ్లీకి ఇప్పుడే పెన్షన్ ఇవ్వరు. 50 ఓవర్ల ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పేసి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడు బయటకు వచ్చేయాలి. అప్పటివరకు విరాట్‌కు పెన్షన్ దక్కదు. కాగా, రిటైర్మెంట్‌తో కోహ్లీ ఆదాయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న విరాట్.. ఏ కేటగిరీకి పడిపోతే బోర్డు నుంచి ఏడాదికి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటాడు. అదే బీ కేటగిరీకి షిఫ్ట్ అయితే అతడికి రూ.3 కోట్లు మాత్రమే దక్కుతాయి.
ఇవీ చదవండి:
ఆ రోజు క్రికెట్ వదిలేస్తా: రోహిత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 12 , 2025 | 01:10 PM