Share News

Rohit Sharma: ఆ రోజు క్రికెట్ వదిలేస్తా.. రోహిత్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 12 , 2025 | 10:50 AM

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై ఇండియన్స్‌కు మరో కప్ అందించాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు హిట్‌మ్యాన్. ఈ మధ్యే టెస్టులకు గుడ్‌బై చెప్పిన భారత స్టార్.. ఆ రోజు క్రికెట్ వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..

Rohit Sharma: ఆ రోజు క్రికెట్ వదిలేస్తా.. రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వర్క్‌లోడ్‌ను తగ్గించుకుంటూ పోతున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్-2025 సీజన్ మధ్యలో టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక మీదట వన్డేల్లో మాత్రమే ఆడతానని క్లారిటీ ఇచ్చాడు. వర్క్‌లోడ్‌తో పాటు ప్రెజర్ తగ్గించుకుంటున్న హిట్‌మ్యాన్.. వన్డేల్లో ఎప్పటివరకు కొనసాగుతాడనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే 50 ఓవర్ల ప్రపంచ కప్ మీద ఫోకస్ చేస్తున్న అతడు.. వన్డే రిటైర్మెంట్ మీద తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు క్రికెట్ వదిలేస్తానంటూ బాంబు పేల్చాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏం అన్నాడంటే..


ఏం చేయాలో తెలుసు..

ఏ రోజైతే ఫీల్డ్‌లో తాను ఏం చేయాలని అనుకుంటున్నానో అది చేయలేనో ఆ రోజు తాను క్రికెట్ నుంచి తప్పుకుంటానని రోహిత్ స్పష్టం చేశాడు. తాను అనుకున్నది అమల్లో పెట్టలేనని అనిపించినప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటానని తెలిపాడు. అలాంటి రోజే వస్తే తప్పకుండా ఆడటం మానేస్తానని క్లారిటీ ఇచ్చాడు హిట్‌మ్యాన్. కానీ ఇప్పుడు మాత్రం తాను ఆటను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన కాంట్రిబ్యూషన్ టీమిండియాకు ఎంతో హెల్ప్ చేస్తోందన్నాడు. క్రికెట్‌కు ఎప్పుడు గుడ్‌బై చెప్పాలనే విషయంలో తనకు పూర్తి స్పష్టత ఉందన్నాడు రోహిత్. ఎలా బ్యాటింగ్ చేయాలి, ఎంత వేగంగా పరుగుల్ని రాబట్టాలి, టీమ్‌‌కు తానేం చేయగలను అనేది క్లారిటీ ఉందన్నాడు. తాను దేనినీ తేలికగా తీసుకోవడం లేదని.. భారత జట్టు బాగు కోసం ఏం చేయాలో అవన్నీ సిన్సియర్‌గా చేస్తున్నానని వ్యాఖ్యానించాడు. టీమ్ గెలుపు కోసం ఏం చేయడానికైనా తాను రెడీ అని వివరించాడు రోహిత్.


ఇవీ చదవండి:

మోదీ పర్మిషన్ ఇస్తారా..

ఐపీఎల్‌కు ఆసీస్ స్టార్లు దూరం

నాకు కెప్టెన్సీ అక్కర్లేదు: బుమ్రా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 10:50 AM