Share News

Virat Kohli Retirement: కోహ్లీ సంచలన నిర్ణయం.. రోహిత్ బాటలో..

ABN , Publish Date - May 12 , 2025 | 11:59 AM

Team India: భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు కింగ్.

Virat Kohli Retirement: కోహ్లీ సంచలన నిర్ణయం.. రోహిత్ బాటలో..
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు ఆడుతూ వచ్చానని.. ఇది తనకు దక్కిన గౌరవమని కోహ్లీ చెప్పాడు. ఇన్నేళ్లు లాంగ్ ఫార్మాట్‌లో కొనసాగుతానని అనుకోలేదన్నాడు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఇది తనను చాలా విధాలుగా మార్చిందని, ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందన్నాడు విరాట్. దీన్ని అంత ఈజీగా మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో ఎమోషనల్ అయిపోయాడు కింగ్. టెస్ట్ టీమ్ కోసం ఏమేం చేయాలో అంతా చేశానని చెప్పుకొచ్చాడు. భారత జట్టు తనకు ఎంతో ఇచ్చిందని, పూర్తి కృతజ్ఞతా భావంతో టెస్ట్ టీమ్‌ను వీడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు. టెస్ట్ కెరీర్‌ విషయంలో హ్యాపీగా ఉన్నానని వివరించాడు విరాట్.


ఇకపై వన్డేల్లోనే..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అతడి బాటలోనే కోహ్లీ నడుస్తున్నాడని, లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. ఇంకొన్నాళ్లు ఆడాలని, కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకు కంటిన్యూ అవ్వాలని కింగ్‌ను బీసీసీఐ కోరిందని సమాచారం. అయినా ఎవరి మాట వినని కోహ్లీ.. రిటైర్ అవుతున్నట్లు తాజాగా అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ టీ20ల నుంచి తప్పుకున్న స్టార్ బ్యాటర్.. ఇప్పుడు లాంగ్ ఫార్మాట్‌ నుంచీ వైదొలిగాడు. ఇక మీదట వన్డేల్లో మాత్రమే విరాట్ బ్యాటింగ్ మెరుపుల్ని చూడగలం. ఇది తలచుకొని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. హ్యాపీ రిటైర్మెంటె లెజెండ్ అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బీజీటీ హీరోకు బంపర్ చాన్స్

ఆ రోజు క్రికెట్ వదిలేస్తా: రోహిత్

మోదీ పర్మిషన్ ఇస్తారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 12:25 PM