ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

children Locked: నాలుగేళ్లుగా పిల్లలను ఇంట్లోనే బంధించిన పేరెంట్స్.. అసలు విషయం ఇదే..

ABN, Publish Date - May 04 , 2025 | 11:56 AM

Spain children Locked: కరోనా కారణంగా ఓ కుటుంబం తీవ్రంగా భయపడిపోయింది. దీంతో పిల్లలను కూడా గత ఆరేళ్లుగా బయటకు రానీవ్వలేదు. ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చిన్నారులను రక్షించారు.

Spain children Locked

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. కొవిడ్ పేరు వింటేనే ఇప్పటికీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఈ వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ నివారణకు అన్నీ దేశాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు లాక్‌డౌన్ విధించగా.. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో కొంతమేర ఈ వైరస్‌ను అడ్డుకున్నట్లు అయ్యింది. అయితే కరోనా తగ్గిన తర్వాతా ప్రాణ భయం కొంతమందిని వీడలేదు. లాక్ డౌన్ ఎత్తివేసినా చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు.


ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు రాలేదు. అయితే 2019లో కరోనా వస్తే ఇప్పటికీ ఓ కుటుంబం ఇంటికే పరిమితం అయ్యిందని తెలుసా.. ఇది విని షాక్ అవుతున్నారా?.. మీరు విన్నది నిజమే.. ఓ కుటుంబం నాలుగేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటోంది. అది ఎక్కడ జరిగింది, వాళ్లు ఇప్పటికీ ఇంకా ఎందుకలా ప్రవర్తించారో తెలుసుకుంటే షాక్ అవ్వక మానరు. జర్మనీకి చెందిన ఓ కుటుంబం కరోనా కంటే ముందు నుంచి స్పెయిన్‌లో జీవిస్తున్నారు. ఆ దంపతులకు ఎనిమిదేళ్ల కవల పిల్లలు, మరో పదేళ్ల బాలుడు ఉన్నారు.


అయితే కరోనా కారణంగా భార్యభర్తలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో తమ పిల్లలకు ఏం కాకుడదని భావించారు. అప్పటి నుంచి ముగ్గురు చిన్నారులను ఓ గదిలో బంధించారు. దాదాపు ఆరేళ్లుగా చిన్నారులను ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బదించారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆరేళ్లుగా చిన్నారులు పడుతున్న బాధను చూసి చలించిపోయారు.


ఈ మేరకు స్పైయిన్ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే వారిని తల్లిదండ్రుల చెర నుంచి విడిపించారు. చిన్నారులను రక్షించి పోలీసులు ధైర్యం చెప్పారు. 2019 నుంచి పిల్లలు వారు ఉంటున్న ఇంటి నుంచి బయటకు రాలేదని పోలీసులు తెలిపారు. వారు మానసికంగా బాధపడుతున్నారని అన్నారు. పిల్లలను హింసించిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం పిల్లలను సంరక్షణ కేంద్రంలో ఉంచామని..వైద్యులు వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారని స్పైయిన్ పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - May 04 , 2025 | 12:11 PM