Share News

Woman Repays Ex Boyfriends Debt: మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

ABN , Publish Date - Apr 21 , 2025 | 07:14 AM

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులన్నీ తీర్చేసి అతడి తల్లిదండ్రులకు అండగా ఉంటున్న ఓ చైనా మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

Woman Repays Ex Boyfriends Debt: మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
Woman Repays Ex Boyfriends Debt

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమలు కూడా కలుషితమైపోతున్న నేటి సమాజంలో నిష్కల్మషమైన మనసుకు ప్రతిబింబంగా నిలుస్తున్న ఓ చైనా మహిళ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.

వాంగ్ టిన్ (34) అనే మహిళ జెంగ్ జీ అనే వ్యక్తితో చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ 2016లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వారిని విడదీసింది. కారు యాక్సిడెంట్‌లో జెంగ్ దుర్మరణం చెందాడు. నాటి నుంచీ జెంగ్ కుటుంబానికి వాంగ్ అన్నీ తానై అండగా నిలిచింది. తాను మరో పెళ్లి చేసుకున్నా కూడా మాజీ బాయ్‌ఫ్రెండ్ కుటుంబబాధ్యతలను భుజాన వేసుకుంది.

బిజినెస్‌మ్యాన్ అయిన జెంగ్ మరణించే నాటికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేవాడు. తన సంస్థలోని ఉద్యోగులకు అతడు జీతాలు చెల్లించలేదు. సరుకులు సప్లై చేసిన ఇతర సంస్థలకు కూడా బాకీ పడ్డాడు. ఫ్రెండ్స్ నుంచి కూడా చేబదులు తీసుకున్నాడు. వాస్తవానికి జెంగ్ మరణంతో అవన్నీ రద్దయిపోవాలి.


కానీ వాంగ్ మాత్రం తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు చెడ్డ పేరు రాకూడదని భావించింది. అతడికి అప్పు ఇచ్చిన వారు కూడా ఇబ్బందుల్లో పడకూడదని భావించి అన్నీ అప్పులూ తీర్చేసింది. జెంగ్ మరణించే నాటికి అతడి తల్లిదండ్రుల ఆదాయం చాలా అల్పం దీంతో, వారి బరువుబాధ్యతలు కూడా తనే భుజాన వేసుకుంది. తను పొదుపు చేసుకున్న సొమ్ము మొత్తాన్ని వాడేసి జెంగ్ అప్పులు మొత్తం తీర్చేసింది.

కొడుకు దూరమైన కుమిలిపోతున్న జెంగ్ తల్లికి మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె మనసును మళ్లించేందుకు, మనసుకైన గాయం నుంచి కోలుకునేలా చేసేందుకు తన సొంత డబ్బుతో జెంగ్ తల్లిని టూర్లకు పంపించింది. జెంగ్ తండ్రి వైద్యఖర్చులు కూడా ఆమె భరించింది. వృద్ధాప్యంలో వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.


2020లో వాంగ్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ మాజీ బాయ్‌ఫ్రెండ్ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేదు. వారిని తన పెళ్లికి కూడా ఆహ్వానించింది. ‘మీరు నాకెప్పుడూ తల్లిదండ్రులే. మీతో కలిపి నాకు ఇప్పుడు ఆరుగురు పేరెంట్స్ ఉన్నారు’’ అని భరోసా ఇచ్చింది. ‘‘నా బాయ్‌ఫ్రెండ్ జీవితంపై ఎలాంటి మచ్చ ఉండకూడదు. అప్పులు తీర్చకుండా వెళ్లిపోయాడన్న అపప్రథ రానీయకూడదనే ఇలా చేశా’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..

Read Latest and Viral News

Updated Date - Apr 21 , 2025 | 07:14 AM