Suicide Bomb : మోదీ.. నాకొక సూసైడ్ బాంబ్ ఇవ్వండి.. పాక్ వెళ్తా.. కర్ణాటక మంత్రి కామెంట్స్ వైరల్..
ABN, Publish Date - May 03 , 2025 | 12:20 PM
Karnataka Minister Suicide Bomber: పహల్గాం దాడి జరిగి వారం గడిచినా దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదు. ఈ సమయంలో కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దూమారం లేపుతున్నాయి. మోదీ-అమిత్ షా లు అనుమతిస్తే పాక్ వెళ్లి ఆత్మాహుతి దాడి చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Muslim Minister Suicide Bomber Statement: పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన నాటి నుంచి భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పహల్గాం హంతకులను భారత ఆర్మీ ఇంకా పట్టుకోలేదనే అసంతృప్తి దేశ ప్రజల మనస్సులో రగులుతూనే ఉంది. ఇదే సమయంలో కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పొరుగు దేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఎల్లప్పుడూ భారతదేశానికి శత్రువేనని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడమే కాదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుమతిస్తే ఆత్మాహుతి బాంబుతో పాకిస్థాన్ తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 'మేము భారతీయులం. మేము హిందుస్తానీలం. పాకిస్థాన్ కు మనతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదు. పాకిస్థాన్ ఎప్పుడూ మనకు శత్రుదేశమే... మోదీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం నన్ను అనుమతిస్తే నేను పాకిస్తాన్ వెళ్లి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకొక ఆత్మాహుతి బాంబు ఇవ్వాలని ప్రధాని మోదీ, అమిత్ షాలను కోరుతున్నాను. దాన్ని నా శరీరానికి తగిలించుకుని పాకిస్థాన్ వెళ్లి వారిపై దాడి చేస్తా' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పర్యాటకులను వారి మతం గురించి అడిగిన తర్వాతే కాల్చిచంపారు. ఈ విషాద ఘటన జరిగి దాదాపు 10 రోజుల దేశప్రజల మనసుల్లో రేగుతున్న మంటలు ఇంకా చల్లారలేదు. దాడి జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్థానీ పౌరులను భారతదేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరతాయనే చర్చలు అంతటా నడుస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ ఈ ఉగ్రవాద దాడికి భారత్ కచ్చితంగా స్పందిస్తుందని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: AIADMK: నీట్‌పై సీఎం క్షమాపణ చెప్పాలి..
Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
India Pakistan Relations: పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Updated Date - May 03 , 2025 | 12:50 PM