Share News

India Pakistan Relations: పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

ABN , Publish Date - May 03 , 2025 | 12:12 PM

పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులను భారతదేశం పూర్తిగా నిషేధించింది.

India Pakistan Relations: పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
India Pakistan Relations

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు (India Pakistan Relations) మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం వెంటనే అమలులోకి వచ్చింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్థాన్ నుంచి వచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై వర్తిస్తుంది.

ఈ క్రమంలో పాకిస్థాన్‌లో లేదా అక్కడి నుంచి ఎగుమతి చేయబడిన అన్ని వస్తువుల దిగుమతి లేదా రవాణా అన్నీ కూడా వెంటనే నిషేధించబడతాయి. ఈ నిషేధానికి మినహాయింపు కోసం భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.


ఆర్థికంగా ఒత్తిడి

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాకిస్థాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఈ దిగుమతుల నిషేధం విధించింది. ఈ నిషేధం విదేశీ వాణిజ్య విధానం (Foreign Trade Policy – FTP) 2023లో భాగంగా కొత్త నిబంధనగా చేర్చబడింది. దీనిలో భాగంగా, పాకిస్థాన్ నుంచి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే లైసెన్సులను రద్దు చేయడం, ఎలాంటి సరుకుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకున్నారు.


ఇరుకున పెట్టేందుకు

ఈ నిషేధంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముంది. భారత ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ వేదికలపై కూడా న్యాయబద్ధంగా నిలబెట్టే ప్రయత్నం చేయనుంది. ఉగ్రవాదంపై "జీరో టోలరెన్స్" విధానాన్ని అనుసరిస్తున్న భారత్, ఆర్థిక, వ్యాపార మార్గాల్లో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా తీసుకున్న చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కౌంటరింగ్ చేసేందుకు భారత్ స్పష్టమైన సంకేతం పంపించినట్టు చెప్పవచ్చు.

ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు

భారత్-పాకిస్థాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా-అటారీ సరిహద్దు ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత మూసివేయబడింది. దీంతోపాటు భారత ప్రభుత్వం 1960లో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి వచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఇలా భారత్.. పాకిస్థాన్ విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంది.


ఇవి కూడా చదవండి:

RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

RCB vs CSK: నేడు ఆర్బీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..


Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్


Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు


Read More Business News and Latest Telugu News

Updated Date - May 03 , 2025 | 12:41 PM