ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

ABN, Publish Date - Dec 24 , 2025 | 07:42 AM

హైదరాబాద్ లోగల జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

- నిబంధనలు పాటించకపోవడంపై ఐఏఎస్‎ల ఆగ్రహం!

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) ఆచార్యులకు పదోన్నతుల కల్పనలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ విషయమై సచివాలయంలో మంగళవారం జరిగిన ఈసీ మీటింగ్‌లో వాడీవేడిగా చర్చ జరిగింది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌(IAS)లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి అర్హులైన ఆచార్యులకు పదోన్నతులు కల్పించేందుకని ఈ నెల 16నుంచి 18వరకు వివిధ విభాగాలకు చెందిన సుమారు 50మంది ఆచార్యులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ప్రతిభను చూడకుండా అందరికీ ప్రమోషన్లు ఇచ్చేలా తీసుకువచ్చిన ప్రతిపాదనలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హులైన ఆచార్యుల పదోన్నతుల కల్పనకు పాలకమండలి సానుకూలంగా ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం ప్రక్రియ జరగకపోవడం, అర్హత లేని వారు కూడా అదనపు సర్వీసు ప్రయోజనాలను కోరుతుండడంతో పాలకమండలిలో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ లు మినిట్స్‌పై సంతకాలు చేయకుండానే సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

కాగా, పదోన్నతుల పైలును పాలకమండలితో ఆమోదింప చేసుకునేందుకని అధికారులు సచివాలయంలో గంటల కొద్దీ ఉండాల్సి వచ్చింది. మరోవైపు మంగళవారమైనా ప్రమోషన్‌ లెటర్లు అందుకోవాలనే తపనతో.. ఇటీవల ఇంటర్వ్యూలకు హాజరైన కొందరు ఆచార్యులు జేఎన్‌టీయూ గెస్ట్‌హౌ్‌సలోనే అర్ధరాత్రి వరకు వేచి ఉన్నట్లు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2025 | 07:42 AM