ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: ఇక.. ఆదివారాల్లోనూ అకడమిక్‌ వర్క్‌..

ABN, Publish Date - May 01 , 2025 | 09:27 AM

జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ తీపికబురు చెప్పింది. అదేంటంటే.. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూసే.. విద్యార్థులు తమ క్లాస్‌వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది.

- కేలండరును సవరించిన జేఎన్‌టీయూ

- ఉత్తర్వులు జారీ చేసిన వర్సిటీ రిజిస్ట్రార్‌

- 3 నెలల ముందే పూర్తికానున్న డిగ్రీ

- బీటెక్‌ విద్యార్థుల్లో ఆనందం

హైదరాబాద్‌ సిటీ: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు జేఎన్‌టీయూ(JNTU) తీపికబురు చెప్పింది. విద్యార్థులు తమ క్లాస్‌వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. కోవిడ్‌ పరిణామాల అనంతరం బీటెక్‌ విద్యార్థుల అకడమిక్‌ షెడ్యూల్‌ గందరగోళంగా తయారైంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పోలీస్‏స్టేషన్ల పేరు మార్పు..


రెండో సెమిస్టర్‌ వేసవి సెలవుల అనంతరం నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ఇంటర్న్‌షిఫ్‏లు, క్యాంపస్‌ ఉద్యోగాలకు వెళ్లాల్సిన విద్యార్థులు సెప్టెంబరు వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి(University Vice Chancellor Kishan Kumar Reddy) దృష్టికి తీసుకు రావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.


గతంలో సెప్టెంబరు ఆఖరుకు ముగిసే సెకండ్‌ సెమిస్టర్‌ను మూడు నెలలు ముందుగా అంటే జూన్‌ నెలాఖరు కల్లా ముగిసేలా అకాడమిక్‌ క్యాలెండర్‌ను సవరించారు. రివైజ్డ్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ నెలాఖరుకు బీటెక్‌ ఫైనలియర్‌ పరీక్షలు పూర్తిచేసి, మొదటి లేదా రెండోవారంలోగా విద్యార్థులకు ఫలితాలు ఇచ్చేందుకు వీలవుతుందని అకడమిక్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణ తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా మూడు నెలల ముందు(జూన్‌)గానే తమ బీటెక్‌ పూర్తికానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా

ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు

సాగర్‌కు యజమాని తెలంగాణే

సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2025 | 09:27 AM