Share News

Jagga Reddy: రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా!

ABN , Publish Date - May 01 , 2025 | 05:04 AM

బీజేపీ.. ఆ పార్టీ పుట్టకముందున్న ఆర్‌ఎస్ఎస్‌లు రాహుల్‌ గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులన్న కనీస జ్ఞానం.. హరీశ్‌ రావుకు లేదా అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Jagga Reddy: రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా!

  • విధానపరంగా బద్ధ శత్రువులు కలుస్తారా?

  • హరీశ్‌కు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా?

  • రేవంత్‌, ఉత్తమ్‌లు ఎన్‌డీఎ్‌సఏ నివేదికనే చెబుతున్నరు

  • బీజేపీతో రాజకీయ సంసారం చేసింది కేసీఆరే

  • తెలంగాణ ఏర్పాటులో మీరాకుమార్‌ది కీలక పాత్ర కాదా!

  • ఆమెను కాదని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయలేదా?

  • కరెన్సీ నోటుపైన గాంధీ బొమ్మనూ తీసేందుకు బీజేపీ కుట్ర

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ.. ఆ పార్టీ పుట్టకముందున్న ఆర్‌ఎస్ఎస్‌లు రాహుల్‌ గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులన్న కనీస జ్ఞానం.. హరీశ్‌ రావుకు లేదా అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. విధానపరంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రె్‌సలు కలుస్తాయని ఎలా అనుకుంటున్నారని నిలదీశారు. ట్రబుల్‌ షూటర్‌ అంటూ బిరుదులు తెచ్చుకున్న హరీశ్‌.. ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మిస్సయ్యాడని ఎద్దేవా చేశారు. మతం మీద రాజకీయం చేసేది బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లైతే.. అన్ని మతాలూ సమానమనేది కాంగ్రెస్‌ విధానమని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటి అయ్యే అవకాశమే లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీరు, మేస్త్రీ.. ఆఖరికి సాయిల్‌ టెస్టింగ్‌ చేసేది కూడా కేసీఆర్‌, హరీశ్‌ రావులే అన్నట్లుగా యాక్టింగ్‌ చేశారని చెప్పారు. ‘‘వైఎ్‌సఆర్‌ హయాంలో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. అప్పుడు నేను, ఇన్నయ్య అక్కడికి వెళ్లి పడవలో తిరిగి చూశాము. అప్పటి ఇంజనీరు హనుమంతరావు ప్రతిపాదన ప్రకారం లిఫ్టులు ఎక్కడ అవసరమో అక్కడ పెట్టారు. కిలోమీటర్ల మేర గ్రావిటీతోనే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన హనుమంతరావు ప్రతిపాదనను కేసీఆర్‌ తుంగలోకి తొక్కారు. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో వచ్చే నీళ్లను వదిలి లిఫ్టులు పెట్టాడు. తప్పుడు ప్లానింగ్‌తో ప్రజల సొమ్మును వృథా చేసి.. నిందలు సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌లపైన వేస్తే ఎలా’’ అంటూ నిలదీశారు. వారేమీ సొంత కవిత్వం చెప్పట్లేదని, ఎన్డీఎ్‌సఏ ఇచ్చిన నివేదికనే చెప్పారన్నారు.


మెదక్‌లో బీజేపీ ఎలా గెలిచింది?

బీజేపీతో రాజకీయంగా చాటుమాటు సంసారం చేసింది కేసీఆర్‌ కుటుంబమేనని జగ్గారెడ్డి ఆరోపించారు. మోదీ ప్రేమ ఉంటే చాలంటూ గజ్వేలు సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెదక్‌ పార్లమెంటు స్థానంలో అయితే బీఆర్‌ఎస్‌, లేకుంటే కాంగ్రెస్‌ గెలవాల్సి ఉందని, కానీ బీజేపీ ఎలా గెలిచిందని హరీశ్‌ రావును ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీరాకుమార్‌ను కాదని, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వాళ్లు తమపైన మాట్లాడతారా? అని మండిపడ్డారు. బీజేపీ గెలిచినా ఫర్వాలేదు.. కాంగ్రెస్‌ రావద్దన్నదే కేసీఆర్‌ ఆలోచనని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ మొత్తం బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసిందని ఆరోపించారు. రాహల్‌గాంధీపై బీజేపీ కుట్ర పన్నిందని, కరెన్సీ నోటులో గాంధీ బొమ్మనూ తీసేందుకు కుట్ర జరుగుతోందని జగారెడ్డి ఆరోపించారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 05:05 AM