Share News

Harish Rao: సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా

ABN , Publish Date - May 01 , 2025 | 04:34 AM

ప్రజలకు ఇచ్చిన మాట ఏం తప్పావో ఒకసారి మీ మ్యానిఫెస్టో చూసుకో. పదేళ్లు అధికారంలో ఉంటానంటూ పగటి కలలు కంటున్నావ్‌.. ఈ మూడేళ్లు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా చేసుకో’’ అని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.

Harish Rao: సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా

  • ఎక్కడైనా చర్చకు సిద్ధం

  • సమయం నువ్వు చెబుతావా..? నన్ను చెప్పమంటావా?

  • రేవంత్‌ రెడ్డీ.. పదేళ్లు అధికారం పగటికలే..

  • ఈ మూడేళ్లు కుర్చీ కాపాడుకో..: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘‘సమయం నువ్వు చెబుతావా..? నన్ను చెప్పమంటావా? రేవంత్‌రెడ్డీ.. నువ్వు అన్నట్లుగానే.. చర్చకు నేను సిద్ధం.. ఎప్పుడు.. ఎక్కడికి రావాలి. కాళేశ్వరంపై చర్చ పెడుదామా? రుణమాఫీపైనా? రైతుబంధు మీద అయినా సరే..! నీ బోగస్‌ 60 వేల ఉద్యోగాల మీద పెడదామా? కులగణనపై చర్చ పెడదామా? చెప్పాలి’’ అని సీఎంకు మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. ‘’ప్రజలకు ఇచ్చిన మాట ఏం తప్పావో ఒకసారి మీ మ్యానిఫెస్టో చూసుకో. పదేళ్లు అధికారంలో ఉంటానంటూ పగటి కలలు కంటున్నావ్‌.. ఈ మూడేళ్లు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా చేసుకో’’ అని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, కాంగ్రెస్‌ సర్కారు పాలనలో పూర్తిగా విఫలమయిందని రుజువవుతోందన్నారు.


అధికారం చేపట్టిన 15 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరొకటిలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవసభ చూసినప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి నిద్రపట్టడంలేదని, అందుకే నిలువెల్లా విషం నింపుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బసవేశ్వరుని జయంతిని, పదవ తరగతి ఫలితాల విడుదల కార్యక్రమాన్ని కూడా రేవంత్‌రెడ్డి తన చిల్లర రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థుల ముందూ.. కేసీఆర్‌పై పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం సరికాదన్నారు. అచ్చోసిన ఆంబోతు అంటున్నవ్‌.. సమాధి కట్టాలంటవు.. సీఎం స్థాయిలో విద్యార్థులకు నువ్వు కల్పించే మంచి భవిష్యత్తు ఇదేనా? అంటూ హరీశ్‌ రావు ప్రశ్నించారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:34 AM