ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hindupuram: సెల్‌ఫోన్‌.. మరో విద్యార్థిని ఊపిరితీసింది..

ABN, Publish Date - Nov 28 , 2025 | 12:41 PM

సెల్‌ఫోన్‌.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు ఆత్మహత్య

హిందూపురం: సెల్‌ఫోన్‌ పక్కనపెట్టి బాగా చదువుకోవాలని దండించినందుకు క్షణికావేశంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూటౌన్‌ ఏఎస్ఐ జయలత తెలిపిన మేరకు సత్యనారాయణపేటలో నివాసమున్న యర్రగడ్ల వ్యాపారి నర్సింహులు నాలుగోకుమార్తె భానుతేజ(19) ఓ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. తరచూ సెల్‌ఫోన్‌ చూస్తుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ‘మిమ్మల్ని ఏడ్పిస్తాను చూడండి’ అంటూ బుధవారం రాత్రి ఇంటి పై అంతస్తులోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది.

ఆందోళనతో కుటుంబ సభ్యులు తలుపులు తీయమన్నా తీయలేదు. దీంతో తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లి ఉరికి వేలాడుతున్న భానుతేజ(Bhanuteja)ను కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై గురువారం పోలీసులకు సమాచారం వెళ్లడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 12:41 PM